Kajal Aggarwal: భర్త గౌతమ్ కిచ్లు విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్న కాజల్ అగర్వాల్ ..!(వీడియో)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. గత ఏడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె ఆచార్య సినిమాలో నటించారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. గత ఏడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె ఆచార్య సినిమాలో నటించారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున ఘోస్ట్ సినిమా నుంచి బయటకు వచ్చిన కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా ఇండియన్ 2 నుంచి కూడా తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా లేటెస్ట్‌గా కాజల్‌కు సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుని ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారట. గౌతమ్ కిచ్లు లుక్ పరంగా చూడటానికి చక్కగా ఉంటాడు.
పెళ్లైన కొత్తలో గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ అగర్వాల్ ఓ కమర్షియల్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ అగర్వాల్‌కు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకుని గౌతమ్ కిచ్లుని ఇండస్ట్రీకి తీసుకొస్తే బావుంటుందని కాజల్ ఆలోచన కావచ్చని అనుకుంటున్నారు. ఇందులో నిజా నిజాలేంటి? అనేది తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం ఎంత వరకు కాజల్ అగర్వాల్ ఆలోచన సక్సెస్ అవుతుందో కూడా చూడాలి. పదిహేనేళ్లకు పైగానే దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపా దడపా బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు కాజల్ అగర్వాల్. అంతేకాదు అటు డిజిటల్ రంగంలోనూ అడుగు పెట్టారు. పెళ్లి తర్వాత భర్త బిజినెస్ వ్యవహారాల్లోనూ ఆమె తోడుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో ఆయనకు జోడీగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదలవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..