మనోడే మొట్టమొదటి హీరో…! NTRతో అట్లుంటది మరి!

Updated on: Aug 07, 2025 | 7:41 PM

ట్రిపుల్‌ ఆర్‌తో గ్గోబల్ రేంజ్‌లో మెరిసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో.. వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వార్ 2 సినిమాతో త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అవుతున్నాడు. ఈక్రమంలోనే ఓ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌ పై తన స్టైలిష్‌ అండ్ పవర్‌ ఫుల్ లుక్స్‌తో ఫ్లాష్‌ అయ్యాడు తారక్.

అయితే ఈ మ్యాగజీన్‌ కవర్ పేజ్‌ పై ఇంత వరకు ఏ సౌత్‌ ఇండియన్ హీరో కనిపించకపోవడం.. ఎన్టీఆర్ మాత్రమే మొట్టమొదటి హీరో కావడం..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హృతిక్ రోషన్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కిన వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈక్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు.. హృతిక్ రోషన్ ఆన్‌లైన్‌లో ఛాలెంజ్‌ విసురుకుంటూ ఈ సినిమాపై బజ్‌ను పెంచేస్తున్నారు. ట్రైలర్‌ లో చూపించినట్టు తమ మధ్య భీకర వార్ జరుగుతుందని.. అది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే అని చెబుతున్నారు. ఈక్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్క్వైర్ ఇండియామ్యాగజీన్‌ కవర్‌పై కెక్కాడు. అందులో రాయల్ లుక్ లో ఎన్టీఆర్ స్వాగ్ అదిరిపోయింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాగజైన్ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. మెరూన్ కలర్ షార్వానిలో స్టైలీష్ గా కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు తారక్. ఈ కవర్ పేజీ ఫోటోషూట్ దుబాయ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టైగర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కామెర్లు ముదిరి కన్నడ స్టార్ హీరో మృతి.. షాక్‌లో కన్నడ ఇండస్ట్రీ!

సారథి స్టూడియోలో గొడవ.. షూటింగ్‌ను అడ్డుకుని కార్మికుడిని కొట్టిన యూనియన్ లీడర్

Renu Desai: రాజకీయ నాయకుల గురించి రేణు దేశాయ్‌ షాకింగ్ పోస్ట్.. ఆలా ఎలా అనేసింది

OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!

తను చదివించిన డాక్టర్లను చూసి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో