పఠాన్‌ 2లో మన టైగర్‌.. NTRను నమ్ముకున్న షారుఖ్

Updated on: Dec 19, 2025 | 5:39 PM

ట్రిపుల్ ఆర్, వార్ 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, YRF స్పై యూనివర్స్‌లో ఏజెంట్ విక్రమ్‌గా స్థిరపడ్డారు. పఠాన్ 2 సినిమాలో తారక్ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. షారుఖ్‌తో కలిసి విక్రమ్ పాత్ర కొనసాగింపు సౌత్ మార్కెట్‌కు ఎంతో కీలకం. యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు.

ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాడు తారక్. వార్ 2 టాక్‌తో సంబంధం లేకుండా నార్త్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. YRF స్పై యూనివర్స్‌లో స్టార్ స్పై విక్రమ్‌గా ఫిక్స్ అయ్యాడు. దీంతో మన హీరో క్యారెకర్టర్‌ను అప్‌కమింగ్ స్పై యూనివర్స్‌ సినిమాల్లో కూడా కంటిన్యూ చేసేందుకు యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలోనే షారుఖ్‌ పఠాన్ 2లో ఓ కీ రోల్ తారక్ కోసం డిజైన్ చేస్తోందట. ఇదే ఇప్పుడు నార్త్‌లోని బిగ్ బజ్. ఇండియన్ బేస్డ్‌ స్పై యూనివర్స్‌ క్రియేట్ చేయాలని ఎప్పటి నుంచో స్పై క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్న యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌… షారుక్‌ పఠాన్‌కు సీక్వెల్‌గా పఠాన్ 2 సినిమాను తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉన్న ఈ సినిమాలో తొందర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా జాయిన్ అవ్వనున్నారట. ఇండియన్ రా ఏజెంట్ పఠాన్‌కు తోడు.. ఏజెంట్ విక్రమ్‌ను కూడా ఈ మూవీ స్క్రిప్ట్‌లో జాయిన్ చేశారట మేకర్స్. పఠాన్ పార్ట్ వన్ సినిమాలో ఏజెంట్ టైగర్ అలియాస్ సల్మాన్ అలా వచ్చి వెళ్లినట్టుగా… పఠాన్‌ 2 ఏజెంట్ విక్రమ్‌ అలియస్ ఎన్టీఆర్, షారుక్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే రక్షించి వెళతాడట. సౌత్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ విక్రమ్‌ క్యారెక్టర్‌ క్యామియోను పఠాన్ 2లో డిజైన్ చేసినట్టుగా బీ టౌన్‌ న్యూస్. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే… యశ్‌ రాజ్ సంస్థ అసలు విషయం చెప్పవరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !! నాగ దుర్గ ఎక్కడికో వెళ్లిందిగా..

Abhi: ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు! అభి కామెంట్స్!

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

Published on: Dec 19, 2025 05:39 PM