Devara OTT Date: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..

|

Oct 30, 2024 | 9:09 AM

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఎన్టీఆర్ కు గతంలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటించాడు.

దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదలైన దేవర టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు దేవర సినిమా రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో ఓటీటీ ఆడియన్స్ కూడా దేవర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఎస్ ! త్వరలోనే దేవర మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి లేదా నవంబర్ 10 నుంచి ఎన్టీఆర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకు రానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో ఒకేసారి దేవర మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on