ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రెండు నెలల విరామం తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులతో కూడిన 20 రోజుల షెడ్యూల్ కొనసాగుతోంది. తారక్ 'ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా' డాన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ముచ్చట్లేంటి..? కొన్ని రోజులుగా అస్సలు ఈ సినిమా గురించి చర్చ లేదు.. అప్‌డేట్స్ లేవు
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ముచ్చట్లేంటి..? కొన్ని రోజులుగా అస్సలు ఈ సినిమా గురించి చర్చ లేదు.. అప్‌డేట్స్ లేవు.. ట్రెండింగ్‌లో లేదు. అసలేంటి సంగతి..? తారక్ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? ప్రజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతంది..? ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ ఎన్ని రోజులు..? ఇవన్నీ చూద్దాం పదండి.. వార్ 2తో దాదాపు పదేళ్ళ తర్వాత ఎన్టీఆర్‌కి ఫ్లాప్ వచ్చింది.. అయితే అది మన సినిమా కాదని సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెలలుగా జరగట్లేదు. దాదాపు 2 నెలల గ్యాప్ తర్వాత నీల్, తారక్ సినిమా మొదలైంది. RFCలో ఈ చిత్ర భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్‌గా తారక్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఈ హీరో. మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్.. ఈ సారి తారక్‌ను మాత్రం మరీ సన్నగా కరెంట్ తీగలా మార్చేసారు. చాలా రోజుల తర్వాత తారక్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 రాత్రులు ఈ షూట్ జరగనుంది. ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్సులే అని తెలుస్తుంది. ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్. 20 రోజుల షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్లే. ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది.. దాంతో పాటు కొన్ని సీక్వెన్సులున్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2026 జూన్ 25న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్. యూనివర్స్‌లో భాగం కాకుండా.. స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే