‘నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి’ మాజీ భార్య దెబ్బకు..

Updated on: Jul 16, 2025 | 8:33 PM

ఈ మధ్య జయం రవి వ్యవహారం అటు కోలీవుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఆర్తి ని వదిలిపెట్టి.. ఇప్పుడు జయం రవి స్టార్ సింగర్ కెనీశాతో తిరగడం సంచలనంగా మారింది. దీంతో మానసికంగా కృంగిపోయిన ఆర్తి తన భర్త తనను.. తన పిల్లలను పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాకు ఎక్కింది.

తన గోడును వెళ్లబోసుకుంది. తన కష్టాలను చెప్పుకొచ్చింది. దాంతో పాటే తన భర్తకు విడాలకు ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయింది. విడాకుల కోసం భర్తతో పాటే కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలోనే తన భర్త.. హీరో జయం రవికి తన డిమాండ్‌తో షాకిచ్చింది. నెలకు 40 లక్షల భరణం కావాలంటూ కోర్టు విన్నవించుకుంది. అయితే తనకు నెలకు 40లక్షలు భరణంగా కావాలని ఆర్తి అడగడంతో.. షాకయ్యారట హీరో రవి. తన ఎక్స్‌ వైఫ్‌ ఆర్తికి అంత ఇచ్చుకోలేనంటూ చెప్పారట. సంవత్సరంలో తాను సంపాదించే దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఆర్తి డిమాండ్ చేస్తుందని.. కావాలనే తనను ఇబ్బందిపెట్టాలనే ఆర్తి ఇలా ప్రవర్తింస్తుందంటూ చెబుతున్నారు. అంతేకాదు తన సంపాదనలో ఎంతో కొంత ఇస్తాను కానీ… నెలకు 40 లక్షలంటే మాత్రం తన వల్ల కాదంటూ కుండబదల్లుకొట్టినట్టు చెబుతున్నారట. ఇక విషయం పక్కకు పెడితే.. విడాకులు తీసుకునే క్రమంలో భర్త నుంచి భార్య ఎంత పడితే అంత భరణంగా పొందే అవకాశం లేదనేది న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్టేట్ కోర్టుల్లో కానీ సుప్రీం కోర్టులో కానీ ఇలాంటి కేసుల్లో స్పష్టమైన తీర్పులు వెలువడ్డాయని గుర్తు చేస్తున్నారు. భర్త అసెట్స్ అండ్ లయబులిటీస్‌ను అంచనా వేసి.. భార్య బేసిక్ నీడ్స్‌కు సరిపోయేలా లెక్కేసి అంత మొత్తాన్ని.. భర్త తన ఎక్స్ భార్యకు భరణంగా ఇచ్చేలా కోర్టు తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం లాంటి ఛాన్స్‌ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..

3 నిమిషాలకు 3 కోట్లు.. ఏ స్టార్ ఫిల్మ్ అయినా.. మనీ మ్యాటర్లో నో కాంప్రమైజ్‌!

18 ఏళ్లు ఎదురుచూసినా..ఆ కోరిక తీరకుండానే.. పాపం! కోట

కొంచెం తింటే ఏం కాదులే అనుకుంటున్నారా.. అదే డేంజర్‌

అదేమన్నా బొమ్మ అనుకుంటివా.. ప్రాణాలు తీసే కింగ్ కోబ్రా.. అలా ఎలా నిలబెట్టావ్ అన్న