అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్‌ ఛేంజర్‌ గురించి భలేగా మాట్లాడాడు

|

Jan 16, 2025 | 1:42 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టుతోంది. రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులు కొల్లగొట్టింది. ఓ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన పోరాటాన్ని సామాజిక సందేశంతో తెరకెక్కించారు శంకర్.

అలాగే రామ్ చరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో ఈ సినిమా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మూవీని తన ఫ్యామిలీతో కలిసి చూసిన జానీ మాస్టర్.. ఈ సినిమాకు తన కొడుకు ఇచ్చిన రివ్యూను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో ధోప్ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్… రిలీజ్ రోజే తన పిల్లలుతో కలిసి గేమ్‌ ఛేంజర్ చూశారు. ఇక సినిమా నుంచి బయటికి వచ్చాక.. తన కొడుకును ఈ సినిమా ఎలా ఉంది? ఏం అర్థమైందని అడిగాడు. దీంతో ఆ బుడ్డోడు.. సినిమా గురించి చాలా చక్కగా వివరించాడు. దీంతో షాకైన జానీ ఈ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ గురించి జానీ మాస్టర్ కొడుకు చెప్పిన మాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..