Janhvi Kapoor: ‘నా తల్లి మరణంపై తప్పుడు ప్రచారం చేశారు’ జాన్వీకపూర్ ఎమోషనల్ !!
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మీడియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి శ్రీదేవి మరణంపై అవాస్తవాలు ప్రచారం చేసిన తీరును గుర్తుచేసుకుని బాధపడ్డారు. ధర్మేంద్ర విషయంలో మీడియా అత్యుత్సాహంపై కూడా మండిపడ్డారు. వ్యక్తిగత బాధలను మీమ్స్‌గా మార్చి, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం నిజమైన జర్నలిజం కాదంటూ జాన్వీ ఆవేదన చెందారు. ఇది మీడియా బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మీడియా పై సీరియస్ అయ్యారు. అప్పుడు అమ్మ విషయంలో.. ఇప్పుడు ధర్మేంద్ర విషయంలో మీడియా తీరు సరిగా లేదంటూ జాన్వీకపూర్ ఆరోపణలు చేశారు. తన తల్లి టైంలో తనపై వచ్చిన కొన్ని తప్పుడు వార్తలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఈ స్టార్ హీరోయిన్. తన తల్లి శ్రీదేవి మరణించినప్పుడు అందరూ తనను టార్గెట్ చేశారంటూ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ నటి జాన్వీకపూర్. తన మాటలను మీమ్స్‌గా ఉపయోగించడంతో మాటల్లో చెప్పలేని బాధ కలిగిందన్నారు. ఇప్పుడు లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణించినప్పుడు కూడా మీడియా అత్యుత్సాహం చూపించిందంటూ మండిపడ్డారు జాన్వీ. ధర్మేంద్ర మృతి విషయంలో కొందరు దిగజారి ప్రవర్తించారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది నిజమైన జర్నలిజం కాదంటూ అసహనం వ్యక్తంచేశారు. తన తల్లి మరణించినప్పుడు టీవీ చూడటానికి కూడా భయం వేసిందన్నారు జాన్వీ. అమ్మ మరణంపై ఎన్నో అవాస్తవాలు ప్రచారంచేశారని.. దాంతో, ఒక కూతురిగా తానెంతో అయోమయానికి గురైనట్టు చెప్పుకొచ్చారు. తన తల్లిపై జరిగిన తప్పుడు ప్రచారాన్ని చూశాక ఎప్పటికీ కోలుకోలేనేమోనని భయపడ్డానన్నారు జాన్వీ. తల్లి మరణంపై కూతురు బాధపడితే కూడా దాన్ని అపహాస్యం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఆ టైమ్‌లో తాను ఏం చెప్పినా తప్పుగానే చూపించేవారని గుర్తుచేసుకున్నారు. ఆ గడ్డుకాలాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్య కాంతాన్ని మించేస్తున్న తనూజ కాతం !! పాపం బిగ్ బాస్
షాజహాన్ – ముంతాజ్ మెచ్చిన రింగ్‌తో నిశ్చితార్థం !! సమంత ఆలోచన వెరీ స్పెషల్
కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్‌లో..శిష్యుడు డేంజర్ జోన్ లో
