బ్యాడ్‌ లక్ అనుపమా..? ఈ సినిమా రిజెల్ట్‌ కూడా.. మూవీ రివ్యూ…

Updated on: Aug 23, 2025 | 12:19 PM

కేంద్రమంత్రి, నటుడు సురేశ్‌ గోపి, అనుపమ పరమేశ్వరన్‌ నటించిన సినిమా ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ కోర్ట్‌రూమ్‌ డ్రామా కాన్సెప్ట్‌తో దర్శకుడు ప్రవీణ్‌ నారాయణన్‌ తెరకెక్కించారు. అయితే కొన్ని రోజుల క్రితం టైటిల్‌ విషయంలో సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీలో దాడికి గురైన మహిళకు.. సీతాదేవి మరో పేరైన జానకి అని పేరుండటంతో సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది.

దీనిపై మూవీ టీం.. కోర్టులో పోరాడినా లాభం లేకుండా పోయింది. దీంతో టైటిల్‌లో చిన్న మార్పు చేసి ‘వి’ యాడ్‌ చేసి… జానకి v vs State of Kerala గా మార్చారు. అలా.. జులైలో ఈ మూవీ రిలీజ్‌ అయింది. అయితే పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో కాకుండా ఒక్క మలయాళంలోనే దీనిని థియేటర్స్‌లోకి తీసుకురాగా, మంచి టాక్ తెచ్చుకుంది. అయితే , ఇప్పుడు ఈ సినిమా…’జీ 5’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇక కథలోకి వెళితే.. ప్రఖ్యాత లాయర్ డేవిడ్ అబెల్ డోనోవన్ అలియాస్ సురేష్ గోపి సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ అలియాస్ అనుపమ పరమేశ్వరన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం వారు ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ మూవీలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

13 అవార్డులు గెలుచుకున్న బెస్ట్ క్రైమ్‌ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే

నటిని హోటల్‌కు రమ్మన్న MLA.. దెబ్బకు పదవి, పరువు పాయే..!

చిరు బర్త్‌డే వేళ.. చరణ్ ఎమోషనల్ మెసేజ్‌

టీజర్‌ను చూసి కన్ఫూజన్‌లో ఫ్యాన్స్?

మామయ్యకు.. బన్నీ క్రేజీగా బర్త్‌డే విషెస్!