జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా

Updated on: Dec 06, 2025 | 2:35 PM

జైలర్ 2 సినిమాపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. అసలు వాళ్లు తీస్తున్నది నిజంగానే సీక్వెలా అని..? ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇందులో నటిస్తున్న ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలు విన్నాక.. జైలర్ 2పై డౌట్స్ షురూ అయ్యాయి. అసలు ఎవరా పాత్ర.. ఆయనేం అన్నాడో చూద్దామా..? మెల్లగా మునిగిపోతున్న రజినీకాంత్ కెరీర్‌ను లంగరేసి మరీ పైకి లాగిన సినిమా జైలర్.

జైలర్ 2 సినిమాపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. అసలు వాళ్లు తీస్తున్నది నిజంగానే సీక్వెలా అని..? ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇందులో నటిస్తున్న ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలు విన్నాక.. జైలర్ 2పై డౌట్స్ షురూ అయ్యాయి. అసలు ఎవరా పాత్ర.. ఆయనేం అన్నాడో చూద్దామా..? మెల్లగా మునిగిపోతున్న రజినీకాంత్ కెరీర్‌ను లంగరేసి మరీ పైకి లాగిన సినిమా జైలర్. రెండేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ దాదాపు 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది జైలర్. నెల్సన్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు.. ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు టీం. జైలర్ 2 షూటింగ్ కూడా ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. 2026 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. జైలర్‌లో ఉన్న క్యారెక్టర్స్ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. అందులో మోహన్ లాల్ కూడా ఒకరు. నిన్నటి వరకు దృశ్యం 3 సెట్స్‌లో ఉన్న ఈయన.. అది ముగించుకుని జైలర్ 2 సెట్‌లో జాయిన్ అయ్యారు. దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది. శివరాజ్ కుమార్ సైతం జైలర్ 2లో ఉంటారని తెలుస్తుంది. మరోవైపు విలన్‌గా వినాయకన్ కంటిన్యూ అవుతున్నారు. అదే అసలు మ్యాజిక్కు.. జైలర్ క్లైమాక్స్‌లో ఈయన చనిపోతారు. అయినా పార్ట్ 2లో ఉన్నారంటే.. జైలర్ 2 సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అనే ప్రచారం మొదలైంది. ఇందులో రజినీ ఫ్లాష్ బ్యాక్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మధ్యే కాంతార ఛాప్టర్ 1 ఇలా ప్రీక్వెల్‌గా వచ్చి సంచలనం రేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??