చేసిందే దొంగ పని.. మళ్లీ అందులో న్యాయమా తల్లి

Updated on: Apr 30, 2025 | 5:01 PM

కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై వరుసగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రమేయమున్న వారందరికీ హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు విచారణకు కూడా హాజరై తామెలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశామో వివరణ కూడా ఇచ్చుకున్నారు.

మరికొందరు సెలబ్రిటీలైతే సోషల్ మీడియాలో వీడియోలు చేసి వదిలారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించింది రీతూ చౌదరి. తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టా వేదికగా మరో సారి చెప్పింది రీతూ. చెప్పడం మాత్రమే కాదు..తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ.. ఎన్ని వీడియోలు చేశాననేది చూడాలి అంటూ.. అందర్నీ రిక్వెస్ట్ చేసింది. కొందరు తాను బెట్టింగ్ యాప్స్‌ను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టు రాస్తున్నారని.. అలా రాయడం తప్పంటూ కాస్త గట్టిగా చెప్పింది. అంతేకాదు తప్పు అని తెలియనప్పుడు తాను బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని.. తెలిశాక అసలు వాటి జోలికి వెళ్లలేదంటూ మరో సారి చెప్పింది. “అన్ని చోట్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇంక తప్పు అని నాకెలా తెలుస్తుంది. అక్కడికి నేను ఒక రెండింటికి మాత్రమే ప్రమోట్ చేశాను. తెలిసాక నేను చేసింది తప్పు అని వీడియో కూడా పెట్టాను. మళ్లీ ఎవరూ చేయొద్దు అని చెప్పాను. బెట్టింగ్ యాప్స్ లో లక్షలు, కోట్లు ఏమీ ఇవ్వరు. మధ్యలో చాలా మంది మీడియేటర్లు ఉంటారు. ఆ ప్రమోషన్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక్కో వీడియోకు 50 వేలు, 60 వేలకు మించి రాదు’ అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. అయితే ఈమె కామెంట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పేలుతున్నాయి. చేసిందే దొంగ పని మళ్లీ అందులో న్యాయమా తల్లి.. అంటూ కొందరి నెటిజన్స్ నుంచి కౌంటర్ వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??