మమతా కులకర్ణి చరిత్ర చిన్నదేమీ కాదు..మహామండలేశ్వరి అవతారం వెనుక పెద్ద కథ! వీడియో

|

Feb 11, 2025 | 5:57 PM

1990లో త‌న గ్లామర‌స్ రోల్స్‌తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు బాలీవుడ్‌ అందాల నటి మమతా కులకర్ణి. చాలా ఏళ్ల తర్వాత ఈ అందాల తార ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా మామూలుగా కాదు.. ఓ సన్యాసినిగా. అవును, మమతా కులకర్ణి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించి కిన్నార్‌ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠి సమక్షంలో సన్యాసం స్వీకరించారు. కిన్నార్‌ అఖాడాలో మహామండలేశ్వరిగా గుర్తింపు పొందారు. అయితే దీనిని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, కిన్నార్‌ అఖాడాకు చెందినవారు వ్యతిరేకించారు. ఇది జరిగిన వారం రోజుల్లోనే మమతపై బహిష్కరణ వేటు పడింది.

ఇది చాలా చర్చకు దారితీసింది. మమతపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రపంచంలో ఉన్న మమత ఉన్నట్లుండి ఆధ్యాత్మికత దారిలోకి ఎందుకొచ్చారని పలువురు స్వామిజీలు, సాధువులు ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే సమయంలో మహామండలేశ్వరిగా మారేందుకు ఆమె 10 కోట్ల రూపాయలు ఇచ్చారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. 2015లో ప్రారంభించిన కిన్నెర అఖాడా ఉన్నట్లుండి నటి మమతా కులకర్ణిని మహామండలేశ్వరిగా నియమించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే ఆమెను తొలగించింది. చాలా మంది మత పెద్దలు మమతకు’మహామండలేశ్వరి’ గుర్తింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. రామ్‌దేవ్ బాబా కూడా దీనితో విభేదించారు. ‘ఎవరూ ఒక్కరోజులో సన్యాసం పొందలేరు. ‘‘ఈరోజుల్లో ఎవరో ఒకరిని పట్టుకుని మహామండలేశ్వరిని చేయడం చూస్తున్నాను’అంటూ ఇన్ డైరెక్టుగ మమత ను విమర్శించారు.

మరిన్ని వీడియోల కోసం :

మహిళకు ఫ్లయింగ్‌ కిస్‌..ఎమ్మెల్యే పై కేసు

చలిమంట ఇలా కూడా కాచుకుంటారా?వీడియో

ఇంత దారుణమా?కన్న కొడుకుని కడతేర్చిన తండ్రి వీడియో

చెవులు కుట్టించబోతే చనిపోయిన బిడ్డ.. అసలేం జరిగింది? వీడియో