Iman Esmail: ఇన్‌స్టా రీల్స్‌ నుంచి ప్రభాస్‌కు జోడీగా ఛాన్స్‌ కొట్టేసిన ఇమాన్.!

|

Aug 21, 2024 | 4:41 PM

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్‌ డ్రామా రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్‌ ఇస్మాయిల్‌ నటిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో అవుతున్న యువతకు ఇమాన్‌ రీల్స్‌ కొత్తేమీ కాదు. తన డ్యాన్స్‌, స్టైల్‌తో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి.

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్‌ డ్రామా రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్‌ ఇస్మాయిల్‌ నటిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో అవుతున్న యువతకు ఇమాన్‌ రీల్స్‌ కొత్తేమీ కాదు. తన డ్యాన్స్‌, స్టైల్‌తో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్‌ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా ఇమాన్‌ ఇస్మాయిల్‌ పేరు ట్రెండ్‌ అవుతోంది.

ఇమాన్ ఇస్మాయిల్ 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో పుట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను ప్రోత్సహించారు. తన తండ్రి పోత్సాహం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి, యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించించింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రాను సుమారు 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రభాస్‌తో ఛాన్స్‌ దక్కించుకోవడంతో మిలియన్‌ ఫాలోవర్స్‌ ఇక లాంఛనమే. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్‌లు జోడించి రీక్రియేట్‌ చేస్తుంది. రీల్స్‌ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు కచ్చితంగా వర్క్‌ షాప్‌ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు, రీల్‌ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అందుకు కాస్ట్యూమ్స్‌ ఏంటి? ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతుంది. ఇన్‌స్టాలో తనతో పోటీపడుతున్న ఇషాన్‌ పటేల్‌ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటానని అంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.