Indraja: ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!

Updated on: Dec 06, 2025 | 11:25 AM

తాజా టాక్ షోలో నటి ఇంద్రజ ప్రేమ, మోసంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోసపోయిన బాధ ప్రసవ వేదనతో సమానమని చెప్పి, మోసం చేసినవారికి పుట్టగతులుండవంటూ శపించారు. ఆమె ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితంపై ఆరా తీస్తున్నారు, గతాన్ని తవ్వుతున్నారు.

దక్షిణాది సినీపరిశ్రమలో ఒకప్పుడు అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే బుల్లితెర అడియన్స్ ముందుకు వచ్చింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె ఓ టాక్ షోకి వెళ్లింది. ఈ షోలో.. తనకు ప్రేమ గురించి మోసం గురించి ప్రశ్న ఎదురుకావడంతో ఇంద్రజ ఒక్క సారిగా ఎమోషనల్ అయింది. తన గుండెల్లో ఉన్న బాధను కోపాన్ని రెండు పదాల్లో బయటపెట్టింది. తన ఘాగు వాఖ్యాలతో… ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరు మనల్ని మోసం చేస్తే… ఆ బాధ ఎలా ఉంటుందంటూ యాంకర్ నుంచి ప్రశ్న ఎదుర్కొన్న ఇంద్రజ.. మొదట తన ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది వివరించింది. నార్మల్ డెలివరీ టైంలో అమ్మాయిలకు వచ్చే పెయిన్‌ హయ్యస్ట్ పెయిన్ అంటారు కదా.. ప్రేమలో ఓడిపోయినా.. మోసపోయినా… అంతకు సమానమైన బాధే కలుగుతుందంటూ చెప్పింది. అలా చెబుతూనే… ఒక అడుగు ముందుకేసి.. అది చేసినవాళ్లు ఆడవాళ్లైనా.. మగాళ్లైనా.. వాళ్లకు పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారంటూ శాపించింది. అయితే ఈమె మాటలు విన్న నెటిజన్లు ఇంద్రజ ప్రేమలో మోసపోయారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె పర్సనల్ లైఫ్‌ గురించి ఆరా తీస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్

సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్

పుతిన్ వెంట ‘మలం’ సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్