Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే

Updated on: Dec 21, 2025 | 5:42 PM

అవతార్ 3 చిత్రంలో పండోరా ప్రపంచాన్ని సృష్టించిన ఘనత ఇండియన్ వీఎఫ్‌ఎక్స్ లీడ్ పావని రావు బొడ్డపాటిదే. వెటా ఎఫ్‌ఎక్స్ టీమ్‌కు నాయకత్వం వహించిన ఆమె, తన అనుభవాలను పంచుకున్నారు. 2009 అవతార్ నుండి పండోరా భాగమైన పావని, తన నానమ్మ ప్రేరణతో ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు. ఆమె కృషి అవతార్ విజువల్స్ కు జీవం పోసింది.

ఎన్నో అంచనాల మధ్య అవతార్ 3 రిలీజ్‌ అయింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో పండోరా ను సృష్టించింది మన ఇండియన్ అమ్మాయే అనే ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. అవతార్ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెటా FX అనే సంస్థ ఆధ్వర్యంలో రూపదిద్దుకుంటున్నాయి. అయితే ఇందులో మన ఇండియన్ అమ్మాయి పావనీ రావు బొడ్డపాటి .. వీఎఫ్ఎక్స్ టీమ్‌ని లీడ్ చేస్తోంది. తాజాగా ఈమె.. తన గురించి, ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక తాను ఢిల్లీలో పుట్టానని చెప్పిన పావని.. తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని, కనిపించిన ప్రతిదాన్ని పేపర్‌పైన బొమ్మగా వేస్తూనే ఉండేవారని.. ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని చెప్పింది. అలా తొలిసారి 2009లో ‘అవతార్’ కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని.. అప్పటినుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఈమె చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!

మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు

అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు

నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే