టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి
భారతదేశంలో అసలైన 70MM ఐమాక్స్ స్క్రీన్లు లేనప్పటికీ, రాజమౌళి వంటి దర్శకులు గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమాలు తీస్తున్నారు. విదేశీ ప్రేక్షకులకు, అలాగే ఇక్కడి వారికి డిజిటల్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లపై ప్రీమియం అనుభూతిని అందించడమే వారి లక్ష్యం. భవిష్యత్తులో నిజమైన ఐమాక్స్ థియేటర్లను ఏర్పాటు చేయాలనే కృషి జరుగుతోంది, ఇది భారతీయ సినిమా గ్లోబల్ రేసులో నిలదొక్కుకోవడానికి దోహదపడుతుంది.
ప్లే చేయడానికి థియేటర్ లేదు కానీ మనోళ్లు సినిమాలు మాత్రం తీస్తున్నారు. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు.. మనం మాట్లాడేది ఐమాక్స్ వర్షన్ గురించి..! అసలిక్కడ స్క్రీన్స్ లేకుండానే ఆ రేంజ్ టెక్నాలజీతో సినిమాలు ఎందుకు తీస్తున్నట్లు..? బేసిక్‌గా అందరికీ వస్తున్న అనుమానం ఇదే. మరి దీనికి పరిష్కారం ఏంటి.. అసలీ ఐమాక్స్ మ్యాటరేంటి..? ఇండియాలో ఉన్నవి డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్లే తప్ప.. అసలైన 70mm అంటే 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. అయినా సరే రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ఈ ఫార్మాట్‌లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి అయినా.. రేపు దివాళికి రాబోయే రామాయణ అయినా ఈ వర్షన్‌లోనే రెడీ అవుతున్నాయి. టాక్సిక్ కూడా ఐమాక్స్ ఫార్మాట్‌లోనే వస్తుందని తెలిపారు యశ్. హాలీవుడ్ మార్కెట్ కోసమే ఐమాక్స్ టెక్నాలజీని నమ్ముకుంటున్నారు మేకర్స్. ఈ ఫార్మాట్‌లో సినిమా తీస్తే గ్లోబల్ ఆడియన్స్‌కి రీచ్ అవుతుందని మనోళ్ల నమ్మకం. మన దగ్గర పూర్తిస్థాయి స్క్రీన్స్ లేకపోయినా.. ఉన్నంతలో లార్జ్ ఫార్మాట్ డిజిటల్ స్క్రీన్స్ మీద ఈ సినిమాలను ప్రదర్శించి ప్రేక్షకులకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్క్రీనింగ్ టెక్నాలజీ లేదని ఆగిపోతే గ్లోబల్ రేస్‌లో వెనుకబడిపోతామని.. ముందు కంటెంట్ రెడీ చేసి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చూసుకుందామనే ధీమాతో వీళ్లు అడుగులేస్తున్నారు దర్శకులు. వారణాసి రిలీజ్ నాటికి కనీసం ఇండియాలో ఒకటైనా 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్ తీసుకురావాలని రాజమౌళి యాజమాన్యంతో చర్చిస్తున్నారు. ఫ్యూచర్ సినిమాలకు ఇదే నాందీ అవ్వొచ్చు కూడా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే
Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్
Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని
Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా