iBOMMA Ravi: పోలీస్ మార్క్ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి
ఐబొమ్మ రవి పైరసీ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. రవి పైరసీ ద్వారా 13.4 కోట్లు, బెట్టింగ్ యాడ్స్ ద్వారా 1.78 కోట్లు సంపాదించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ వెల్లడించింది. విదేశీ కరెన్సీలో లావాదేవీలు జరిగాయని, కోవిడ్ తర్వాత తన వ్యాపారం పెరిగిందని రవి ఒప్పుకున్నాడు. అతని జల్సాలు, కార్యకలాపాల వివరాలు కస్టడీలో వెల్లడయ్యాయి.
ఐబొమ్మ రవి పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు పైరసీతో తనకు చెందిన 7 బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం 13 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చినట్లు రవి ఒప్పుకున్నట్లు ఆ నివేదికలో ప్రస్తావించారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా రూ. 1.78 కోట్ల భారీ మొత్తం కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. ట్యాక్స్ ఇబ్బందుల దృష్ట్యా అందులో రూ.90 లక్షలను తన సోదరి చంద్రికకు పంపాడు. అలాగే లావాదేవీలన్నీ విదేశీ కరెన్సీ రూపంలోనే చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలం పాటు కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి హాస్పిటల్ దగ్గరలో రవి ఒక ఆఫీస్‌ను నడిపాడు. అప్పట్లో పది మంది యువకులను నియమించుకుని రవి పైరసీ చేయించాడు. అనంతరం ఓ విదేశీయుడి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందాడు. రవి రెండురకాలుగా సినిమాకు కొనుగోలు చేశాడని పోలీసుల కస్టడీ రిపోర్ట్ చెబుతోంది. లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే చేసిన రవి.. బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఒక్కో సినిమా క్యామ్ కార్డర్ ప్రింట్‌కు 100 డాలర్లు, HD ప్రింట్‌కు 200 డాలర్లను రవి చెల్లించాడని పోలీసులు అంటున్నారు. కోవిడ్ తరువాత తన బిజినెస్ మెరుగుపడిందని రవి పోలీసులకు వివరించాడు. ఆన్లైన్లో సినిమాలు చూసే వారి సంఖ్య కొవిడ్ తర్వాత పెరిగిందన్నాడు. దాంతో తనకు బాగా డబ్బులొచ్చాయని రవి ఒప్పుకున్నాడు. 12 రోజుల కస్టడీలో రవి చెప్పిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. పైరసీ, బెట్టింగ్ విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించి.. రవి దొరికిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ
జనవరి 1 నుంచి మారిన రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం
