Vishwak Sen – Gaami: స్పర్షలేని మనిషి కథే ‘గామి’ దిమ్మతిరిగేలా చేస్తున్న టీజర్‌.!

|

Feb 18, 2024 | 10:54 AM

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో విశ్వక్ సేన్... ఇప్పుడు గామి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే రొమాంటిక్, యాక్షన్ చిత్రాలు కాకుండా.. ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంతో తీసుకురాబోతున్నారు. డైరెక్టర్ విద్యాధర్ కాగిత దర్శకత్వం వవహిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంటూనే సినిమాపై అంచనాలను పెరిగేలా చేస్తోంది.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో విశ్వక్ సేన్… ఇప్పుడు గామి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే రొమాంటిక్, యాక్షన్ చిత్రాలు కాకుండా.. ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంతో తీసుకురాబోతున్నారు. డైరెక్టర్ విద్యాధర్ కాగిత దర్శకత్వం వవహిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంటూనే సినిమాపై అంచనాలను పెరిగేలా చేస్తోంది. ఇక ఇప్పటికే గామి సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మొదటి సారి ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించనున్నారు. దీంతో గామి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ పోస్టర్ తోపాటు.. మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్‌న మరో లెవల్‌కు తీసుకెళ్లింది గామి టీజర్. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. స్టోరీ ఏమి చెప్పకుండా కేవలం పాత్రలను మాత్రమే రివీల్ చేశారు డైరెక్టర్. ఇందులో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరో రెండు భిన్నమైన గెటప్ లలో విశ్వక్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ సినిమా అని హింట్ ఇచ్చారు మేకర్స్. దాంతో పాటే ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 29న రిలీజ్ చేస్తున్నట్టు… సినిమా రిలీజ్ మార్చ్‌ 8 అంటూ అనౌన్స్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..