Hrithik Roshan – NTR: ‘NTRతో వార్‌ కోసం వెయిట్ చేస్తున్నా.’ హృతిక్ సెన్సేషన్ కామెంట్స్.

|

Jan 31, 2024 | 1:11 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న తారక్.. అటు నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈమూవీ తర్వాత ఆయన నటిస్తోన్న దేవర సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే అటు హిందీలో వార్ 2 చిత్రంలోనూ తారక్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని బీటౌన్ హీరో హృతిక్ కన్ఫా్ర్మ్ చేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న తారక్.. అటు నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈమూవీ తర్వాత ఆయన నటిస్తోన్న దేవర సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే అటు హిందీలో వార్ 2 చిత్రంలోనూ తారక్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని బీటౌన్ హీరో హృతిక్ కన్ఫా్ర్మ్ చేశాడు. దీంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం తెలుగు, హిందీ అడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ నెట్టింట వైరలవుతుంటాయి. తాజాగా వార్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు హృతిక్.

ఇటీవలే ఫైటర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు హృతిక్. దీపికా పదుకొణే కథానాయికగా నటించగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో అనిల్ కపూర్ కీలకపాత్ర పోషించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హృతిక్.. వార్ 2 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని.. ఎన్టీఆర్ తో జరిగే షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని.. అందుకోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో స్టార్ట్ కానుందని.. అప్పుడే తారక్ ఈ సెట్ లో అడుగుపెట్టనున్నారని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత తారక్, హృతిక్ లపై ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని.. అందుకు ఇప్పటికే భారీ సెట్ వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos