వణుకు పుట్టించడానికి సిద్ధం అంటున్న నాయికలు
వీడు మరీ ఇంత వయెలెంట్‌గా ఉన్నాడు.. కాస్త పువ్వుల్నీ అమ్మాయిల్నీ చూపించండ్రా అనే డైలాగ్ మన దగ్గర ఫేమస్ కదా.. అంతకన్నా ఫేమస్ హీరోయిన్లు హారర్ మూవీస్‌తో భయపెట్టడం. ఎప్పుడో.. ఒకసారి భయపెట్టే అందాల భామలు ఇప్పుడు నేనంటూ.. నేనంటూ క్యూ కడుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? కమర్షియల పీలింగ్స్ సాంగ్స్ లోనే కాదు.. వెన్నులో వణుకుపుట్టించే పాత్రల్లోనూ చేసి చూపిస్తానంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
నార్త్ లో ఆమె నటిస్తున్న హారర్ సినిమా థామా. మడాక్ హారర్ కామెడీ యూనివర్శ్‌లో ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. నార్త్ లో ఫుల్ బిజీ అయిన తమన్నా చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘వివాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనేది. మైథలాజికల్ హారర్ బ్యాక్ డ్రాప్‌లో ఫారెస్ట్ థీమ్‌తో తెరకెక్కుతోంది. రాత్రిపూట ఎర్రటి చీరలో కారు దిగి అడిలోకి వెళ్లిన తమన్నాని చూస్తుంటే భయం ఆల్రెడీ స్టార్ట్ అయిందంటున్నారు నెటిజన్లు. అనూ ఇమ్మాన్యుయేల్ అంటే మనకిన్నాళ్లూ అల్లరిగా, క్యూట్‌గా, అందంగా కనిపించడమే తెలుసు. కానీ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, హారర్ నేపథ్యంలో ‘బూమరాంగ్’ చేస్తున్నారు అనూ ఇమ్యాన్యుయేల్. నిధి అగర్వాల్ ది రాజాసాబ్‌లో హారర్ ఎలిమెంట్స్ గురించి చెబుతూనే ఉన్నారు. ఇటు పిశాచి 2లో భయపెట్టడానికి రెడీ అవుతున్నానంటున్నారు ఆండ్రియా. కాంచన 4లో పూజా హెగ్డే నటిస్తున్నారు నోరా ఫతేహి కూడా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన కాంచన సీరీస్‌లను గుర్తుచేసుకుంటున్నారు ఆడియన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
