Trisha: ఇరగదీసిన త్రిష.! మరో కొత్త కథతో.. మన ముందుకు..

త్రిష లీడ్‌లో.. సూర్య మనోజ్‌ వంగాల డైరెక్షన్లో.. ఇన్‌వెస్టిగేషన్‌ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సిరీస్ బృంద. తాజాగా ఈ సిరీస్ నుంచి టీజర్‌ రిలీజ్‌ అయింది. మనలో ఉన్న మంచితోనే పోరాటం చేయాలని.. మంచిని మన నుంచి వెళ్లనీయకుండ కాపాడుకోవాలని.. మనం మనిషిగా జన్మించినందుకు ఏదోకి మంచి చేసి పోవాలి అని టీజర్లో వినిపించే డైలాగ్స్.. త్రిష ఇన్‌వెస్టిగేషన్ చేస్తున్న సీన్ క్లిప్స్‌ .. ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

Trisha: ఇరగదీసిన త్రిష.! మరో కొత్త కథతో.. మన ముందుకు..

|

Updated on: Jul 12, 2024 | 11:17 AM

సమ్మర్ హాల్‌డేస్ అయిపోగానే.. పిల్లలు బడి బాట పట్టినట్టు.. సినిమాలు కాస్త తగ్గగానే సిరీస్‌ల బాట పడుతున్నారు కొందరు సెలబ్రిటీలు. ఇక ఆ కొందరిలో తాను కూడా ఉన్నా అంటూ.. రీసెంట్‌గా తన డెబ్యూ సిరీస్‌ గురించి అనౌన్స్ చేసిన త్రిష.. తాజాగా ఆ సిరీస్ టీజర్‌తో అందర్లో తెలియని ఉత్కంఠను పెంచేశారు. తన సిరీస్‌ గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నారు. త్రిష లీడ్‌లో.. సూర్య మనోజ్‌ వంగాల డైరెక్షన్లో.. ఇన్‌వెస్టిగేషన్‌ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సిరీస్ బృంద. తాజాగా ఈ సిరీస్ నుంచి టీజర్‌ రిలీజ్‌ అయింది. మనలో ఉన్న మంచితోనే పోరాటం చేయాలని.. మంచిని మన నుంచి వెళ్లనీయకుండ కాపాడుకోవాలని.. మనం మనిషిగా జన్మించినందుకు ఏదోకి మంచి చేసి పోవాలి అని టీజర్లో వినిపించే డైలాగ్స్.. త్రిష ఇన్‌వెస్టిగేషన్ చేస్తున్న సీన్ క్లిప్స్‌ .. ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇన్‌వెస్టిగేషన్‌ థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడే వారికైతే ఏకంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది బృంద టీజర్. ఇక సోనీ లివ్‌ ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సిరీస్.. సోనీ లివ్‌ ఓటీటీ ప్లాట్‌ ఫాంలోనే ఆగస్ట్‌ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ లాంగ్వేజ్‌లలో కూడా.. అదే రోజు ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ సోనీ లివ్‌ రీసెంట్‌గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కూడా రిలీజ్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us