అట్లీ ఔట్.. ఈ క్రేజీ డైరెక్టర్‌తోనే అల్లు అర్జున్ తర్వాతి సినిమా

TV9 Telugu

16 July 2024

అల్లు అర్జున్  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. ఈ  సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబరు 6న ఈ చిత్రం విడుదల కానుంది

అయితే పుష్ప 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది

త్రివిక్రమ్, సందీప్‌ రెడ్డిలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్  కమిట్‌ అయినప్పటికీ ఈ మూవీస్ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలేవీ కనిపించడం లేదు.  

అందుకే ఈ లోపు మరో దర్శకుడితో అల్లు అర్జున్  సినిమా చేయాలనుకుంటున్నారని  ఫిల్మ్‌నగర్‌  సర్కిల్ లో వినిపిస్తోంది,

దీంతో ఆయన తర్వాతి సినిమా దర్శకుల జాబితాలో జవాన్ డైరెక్టర్ అట్లీ, బోయపాటి శీను, సురేందర్‌ రెడ్డి తదితర డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే రజనీకాంత్‌తో ‘జైలర్‌’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన నెల్సన్  దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్  నెక్ట్స్‌ మూవీ తెరకెక్కనుందని టాక్.

ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్  చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట. దీంతో ఈ కథకు తుది మెరుగులుదిద్దే పనిలో ఉన్నారట డైరెక్టర్.

అన్నీ అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్ –నెల్సన్  దిలీప్‌ కాంబినేషన్ లోనే సినిమా త్వరలోనే పట్టాలెక్కవచ్చని సమాచారం.