Nabha Natesh – Priyadarshi: హీరోయిన్ నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్ యాక్టిడెంట్ తర్వాత కోలుకుని సినిమాల్లోకి బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఆలెడ్రీ నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్వయంభు తో మన ముందుకు రాబోతోంది. ఇక మరోపక్క ప్రియదర్శి.. కమెడియన్ టూ కంటెంట్ ఉన్న సినిమాలకు మెయిన్ లీడ్‌గామారిపోయి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే వీరిద్దరూ తాజాగా ట్విట్టర్ ఎక్స్‌లో.. పోటా పోటీగా కొట్టుకుంటున్నట్టు ట్వీట్లు చేస్తున్నారు.
నభా నటేష్ యాక్టిడెంట్ తర్వాత కోలుకుని సినిమాల్లోకి బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఆలెడ్రీ నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్వయంభు తో మన ముందుకు రాబోతోంది. ఇక మరోపక్క ప్రియదర్శి.. కమెడియన్ టూ కంటెంట్ ఉన్న సినిమాలకు మెయిన్ లీడ్‌గామారిపోయి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే వీరిద్దరూ తాజాగా ట్విట్టర్ ఎక్స్‌లో.. పోటా పోటీగా కొట్టుకుంటున్నట్టు ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ మ్యాటరేంటంటే.. వీళ్లిద్దరూ గొడవ పడుతున్నట్టు ట్వీట్లు చేసుకుంటున్నా.. ఇదో సినిమా ప్రమోషన్ అనే క్లారిటీలోనే ఉన్నారు జనాలు. ఆ క్లారిటీతో పాటు.. వీళ్ల ట్వీట్స్ కు ఎంటర్ టైన్ కూడా అవుతూ వాటిని నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే..! రీసెంట్గా నభా నటేషా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. ప్రభాస్ డార్లింగ్.. డార్లింగ్.. అంటూ పిలిచే వర్జినల్ వాయిస్‌ను తన యాక్టింగ్‌తో మ్యాచ్ చేసింది. అయితే ఈ వీడియోకే.. వావ్ సూపర్ డార్లింగ్.. కిర్రాక్గా ఉన్నావ్ డార్లింగ్ అంటూ రిప్లై ఇచ్చాడు ప్రియదర్శి.
ఇక ప్రియదర్శి చేసిన ఈ ట్వీట్‌కు కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది నభా..! choose your words carefully before commenting మిస్టర్!! అంటూనే అన్ నోన్ అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం సెక్స్‌వల్ హరాస్మెంట్ కిందికి వస్తుందని.. IPC 354A ప్రకారం అది చట్టరిత్యా నేరం అని తెలిసేలా.. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ ఫోటో రూపంలో షేర్ చేసింది. ఇక అందుకు ప్రియదర్శి.. ‘మనం ఇద్దరం అన్ నోన్ అని తెలియదు. అయినా మీరు డార్లింగ్ అంటూ పర్లేదే మేం అంటేనే సెక్షన్లు కేసులా..? లైట్ తీసుకో డార్లింగ్ అంటూ.. మరో ట్వీట్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నభా.. డోంట్ క్రాస్ ద లైన్స్! చూసుకుందామ్ అంటూ.. మరో ట్వీట్ చేసింది. ఇలా పోటా పోటీగా వీరిద్దరూ ట్వీట్లు చేసుకోవడం.. వీరిద్దరూ లీడ్ రోల్ చేస్తున్న అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్లో భాగమని తెలుస్తున్నా.. ఆ సినిమా ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ ఇప్పుడు అందర్లో నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!