ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరో.. ఏంటీ పిచ్చి నిర్ణయం
‘ట్వెల్త్ ఫెయిల్’తో దేశం దృష్టిని ఆకర్షించారు యువ కథానాయకుడు విక్రాంత్ మాస్సే. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులతో పాటు సినీప్రియులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఇక కొత్త సినిమాలు చేయనంటూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన, ‘కొన్ని సంవత్సరాలుగా అందరి నుంచి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నాను.
మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. కుటుంబసభ్యులకు నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. అందుకే సినిమాలను ఇక అంగీకరించడం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నా చివరిది. ఇటీవల నేను నటించిన చిత్రాలపై మీరు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు’ అని నోట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంచు మనువరాళ్లు.. ఖుషీగా తాత మోహన్ బాబు
TOP 9 ET News: థియేటర్స్‌లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ మెంటలెక్కిపోతున్న ఆడియెన్స్
Pushpa 02: పుష్ప-2 పబ్లిక్ టాక్.. దద్దరిల్లుతున్న థియేటర్లు