Jagapathi Babu – Rudrangi: నా సినిమాకు దిక్కులేదు.. మరీ నాలుగు రోజులేనా..!: జగపతిబాబు.

|

Sep 20, 2023 | 7:07 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్‌దాస్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్‌దాస్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మించారు. రుద్రంగి క‌థ న‌చ్చడంతో రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని సినిమా చేశానని చెప్పుకొచ్చారు జగపతి బాబు. కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా స‌రిగా ప్రమోష‌న్స్ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే.. నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయిందన్నారు జగపతి బాబు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జ‌గ‌ప‌తిబాబు చేసిన కామెంట్స్ వైర‌లవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్‌ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..