Dulquer Salmaan: హీరో 100 కోట్ల కల.. ఒక వేళ నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్లో..

|

Oct 31, 2024 | 9:09 AM

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‏కు సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ఇప్పుడు తెలుగులోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో ... లక్కీ భాస్కర్ గా మన ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 31న థియేటర్లో సందడి చేయబోతున్నాడు.

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‏ లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లో.. షాకింగ్ కామెంట్స్ చేశారు దుల్కర్. తనకు 100 కోట్ల కలెక్షన్స్ ఓ కలని.. అది ఈ సినిమాతో జరిగితే.. ప్రొడ్యూసర్ ఫోటోను తన ఇంట్లో పెట్టుకుంటా అంటూ.. చెప్పారు. ఇప్పుడీ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ హీరో.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ సినిమా ఫస్ట్ డే రూ.100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు అన్నారు. అయితే ఈ మాటలపై హీరో దుల్కర్ సల్మాన్ రియాక్టయ్యాడు. తనది 13 ఏళ్ల కెరీరని.. ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలు చేశానని.. కానీ వంద కోట్ల కలెక్షన్స్ అనేది ఇప్పటికీ తనకు కలగానే మిగిలింది అన్నాడు దులక్కర్.

నిజంగా లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తే నాగవంశీ ఫోటో ఫ్రేమ్ చేయించి మా ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు. తన సినిమా వంద కోట్లు సాధిస్తే తనకంటే ఎక్కువగా ఆనంధించే వ్యక్తి ఈభూమి మీద ఎవరూ ఉండరంటూ చెప్పాడు. అని అన్నారు. దీంతో దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on