కడుపు నింపని పురస్కారాలు నాకెందుకు.. ఓ రచయిత ఆవేదన

Updated on: Nov 05, 2025 | 4:39 PM

భారతదేశం ఎందరో మహాకవులు, రచయితలకు పుట్టినిల్లు. అద్భుతమైన రచనలు చేసి ఎన్నో పురస్కారాలను అందుకున్న కొందరు రచయితలు తినడానికి తిండిలేక, అనారోగ్యానికి గురైతే బాగుచేయించుకునే స్తోమత లేక కడు పేదరికం అనుభవిస్తున్నారు. వీరి కళానైపుణ్యాన్ని మెచ్చి సత్కారాలు చేసి, పురస్కారాలు ఇచ్చిన ప్రభుత్వాలు వారు కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే వారి ఆవేదన ఎలాఉంటుందో ఈ ఘటన నిరూపిస్తుంది.

కర్నాటకకు చెందిన ప్రముఖ రచయిత, పుస్తక ప్రియుడు తన పురస్కారాలను, పుస్తకాలను మంటల్లో తగలబెట్టేశారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తనకు ప్రభుత్వం సాయం చేయలేదన్న బాధతో ‘పుస్తక ప్రియ’గా గుర్తింపు పొందిన సాహితీవేత్త హరిహర ప్రియ తనకు వచ్చిన పుస్తకాలు, పురస్కారాలకు నిప్పు పెట్టి తగలబెట్టేశారు. మాలూరులో నివాసముంటున్న ఆయన గుండెపోటుకు గురై ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వెళ్లారు. తన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, వైద్య ఖర్చులకు సాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగికి లేఖలు రాశారు. కోలారు జిల్లా పాలనా యంత్రాంగం సహకారంతో ఏడాదికాలంగా ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దాంతో ఆయనకు వచ్చిన గౌరవ డాక్టరేట్‌తో సహా వివిధ సంస్థలు ప్రదానం చేసిన పురస్కారాలు, ప్రమాణ పత్రాలు, తాను రచించిన పుస్తకాలను మంటల్లో వేసి కాల్చి వేశారు. తనకు సాయం చేసేందుకు ప్రభుత్వానికి మనసే రాలేదని, వైద్య చికిత్సలకు రూ.4.5 లక్షలను అప్పు చేయవలసి వచ్చిందని చెప్పారు. ఇదే బాధతో పుస్తకాలను, పురస్కారాలను కాల్చివేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aliens: భూమిపై ఉన్న అణు స్థావరాలపై ఏలియన్స్‌ నిఘా

విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే

టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. పాపం.. అంతలోనే

ట్రక్కు నిండా కరెన్సీ నోట్లు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగరేశాడు

సెలెబ్రిటీల వెంట పోకిరీల తంటా.. ఆన్‌లైన్ వేధింపులకు గురైన నటి