RGVకి మరో షాక్! పోలీసులతో ఎకసెక్కాలా

|

Feb 09, 2025 | 7:14 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫోటోల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఫిబ్రవరి 07న విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీని ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత సమయం ఇచ్చినా డైరెక్టర్ సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఇక విచారణ ముగియడంతో రామ్ గోపాల్ వర్మ పోలీసు స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లారు. అయితే ఇంతలోనే ఆర్జీవీకి మరో షాక్ ఇచ్చారు గుంటూరు పోలీసులు. 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా ఉన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నవంబర్ 29న సీఐడీ కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాడు. దీంతో గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి డైరెక్టర్ కు నోటీసులు జారీ చేశారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసులు అందించారు.ఈనెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ కి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సన్యాసం తీసుకున్న మరో హీరోయిన్.. ఇదేంటిలా?

షాకింగ్ న్యూస్.. సాయిపల్లవి డైరెక్షన్లో… నాగ చైతన్య హీరోగా సినిమా!

శోభితపై దారుణ విమర్శలు! బాధపడిన నాగ చైతన్య..

ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. చివరికి పెళ్లిగా మారింది!

ఈ బ్యూటీ సంపాదన తెలిస్తే మన హీరోయిన్స్ బోరున ఏడ్చేయరూ