అదేం తలతిక్క ప్రశ్న.. పద్ధతి తెలీదా ??
ఇటీవల 'అదర్స్' సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రెస్ మీట్‌లో నటి గౌరీ కిషన్ బాడీ షేమింగ్‌కు గురయ్యారు. ఓ జర్నలిస్టు ఆమె బరువు గురించి అభ్యంతరకర ప్రశ్న అడగగా, గౌరీ తీవ్రంగా స్పందించారు. "నా బరువుతో నీకేం పని?" అంటూ గట్టిగా బదులిచ్చారు. బాడీ షేమింగ్ చేస్తే సహించబోనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో గౌరీకి మద్దతు వెల్లువెత్తుతోంది.
తమిళంలో విడుదలైన 96 సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష టీనేజ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది గౌరీ కిషన్. అదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. తెలుగులోనూ అదే పాత్రలో కనిపించింది. కేరళకు చెందిన గౌరీ కిషన్ తెలుగుతోపాటు,తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా రాణిస్తుంది. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. విజయ్ మాస్టర్, ధనుష్ కర్ణన్, జి.వి. ప్రకాష్ అడియే, ఉలగమై, హాట్‌స్పాట్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది గౌరీ. ఆమె ప్రస్తుతం అదర్స్ చిత్రంలో నటిస్తోంది. అబిన్ హరికరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలైంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. ఈ క్రమంలో నవంబర్ 6న చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా.. అక్కడే ఉన్న ఓ విలేకరి ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు ?’ అని ఓ షాకింగ్ ప్రశ్న అడిగాడు. దీంతో గౌరీ కిషన్ సదరు జర్నలిస్టుపై సీరియస్ అయ్యింది. ‘నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు? బాడీషేమింగ్ చేస్తే ఊరుకోను అంటూ.. ఆ జర్నలిస్టుకు గట్టిగా ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు తాను యాక్ట్ చేసిన సినిమా గురించి ప్రశ్నలు అడిగితే ఆన్సర్ ఇస్తానే కానీ.. తన బరువు గురించి ఎగతాళి చేయడం ఏంటని ప్రశ్నించింది ఈమె. అయితే హీరోయిన్ ఘాటు రిప్లైకి ఏమాత్రం వెనక్కి తగ్గని సదరు జర్నలిస్టు మరో సారి అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడగడంతో ఆయన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే హీరోయిన్‌కు మద్దతు పెరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 60కోట్ల చిక్కుల్లో శిల్పాశెట్టి.. బిగుసుకుంటున్న కేసు
SSMB29: అత్యంత దుష్ట, క్రూర,శక్తివంతమైన నా విలన్ ఇతడే..
అతను జర్నలిస్టు కాదు..! సీరియస్ కామెంట్స్ చేసిన హీరోయిన్
తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు
TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
