హిట్టు కోసం హిస్టరీ తవ్వుతున్న యాక్షన్ హీరో

Edited By:

Updated on: Jan 25, 2026 | 9:28 PM

గోపీచంద్ తన ఫ్లాప్ స్ట్రీక్ నుండి బయటపడటానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 7వ శతాబ్దపు చారిత్రాత్మక చిత్రాన్ని చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచాయి. గోపీచంద్ కెరీర్‌కు, దర్శకుడి కెరీర్‌కు కీలకమైన ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.

హిట్టు కోసం హిస్టరీ తవ్వుతున్నారు గోపీచంద్. కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న ఈ యాక్షన్ హీరో.. చారిత్రాత్మక చిత్రంతో తన బ్యాడ్ ఫేస్‌కు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. అందుకే పీరియడ్ సినిమాల స్పెషలిస్ట్‌తో కలిసి మ్యాజిక్ చేస్తున్నారు. మరి గోపీచంద్ కొత్త సినిమా ముచ్చట్లేంటి.. ఎలా వస్తుంది.. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఒకప్పుడు వరస విజయాలతో జోరు చూపించిన గోపీచంద్.. కొన్నేళ్లుగా ఆ మ్యాజిక్ చేయలేకపోతున్నారు. విశ్వం సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్లు రాలేదు. అందుకే గ్యాప్ తీసుకుని సంకల్ప్ రెడ్డితో ప్రస్టజియస్ మూవీ చేస్తున్నారు ఈ యాక్షన్ హీరో. 7వ శతాబ్ధపు నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ వెంకట్ మాస్టర్ ఆధ్వర్యంలో 25 రోజుల నైట్ షెడ్యూల్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ సినిమాపై హైప్ పెంచేసాయి. పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో వారియర్‌గా అదిరిపోయారు గోపీచంద్. ఘాజీ, IB71 లాంటి డిఫెరెంట్ సినిమాల తర్వాత సంకల్ప్ నుంచి వస్తున్న విభిన్నమైన సినిమా ఇది. గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కిస్తున్నారు సంకల్ప్. ఇది కేవలం గోపీకి మాత్రమే కాదు.. దర్శకుడి కెరీర్‌కు కూడా కీలకమే. ఈ సినిమాకు హై రేంజ్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. 2026లోనే ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అయినా గోపీ ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ పడుతుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి మంచి గుణపాఠం నేర్పిందిగా

NBK111 ముహూర్తం ఫిక్స్.. ఈసారి ప్లాన్ మామూలుగా లేదు

‘యాత్ర’ అయిపోంది.. ఇప్పుడు ‘పాదయాత్ర’ మొదలైంది

Jana Nayagan: జననాయగన్‌కు అమెజాన్ 120 కోట్ల దెబ్బ ??

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Published on: Jan 25, 2026 09:28 PM