హైద్రాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ.. దానికంటే పెద్దగా ఉండబోతుందా

Updated on: Dec 04, 2025 | 3:00 PM

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్పందన లభిస్తుండగా, అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. రిలయన్స్ గ్రూప్‌ నైట్ సఫారీ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి.

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపధ్యంలో డిసెంబర్ 8–9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ–విదేశాల నుండి భారీ స్పందన లభిస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. అంతేకాదు రిలయన్స్ గ్రూప్‌ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్​కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ .. నైట్ సఫారి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Avatar 3: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్ 3 గ్రాండ్‌ రిలీజ్‌.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

Nelson Dilipkumar: రాజమౌళిని మించి నెల్సన్ మాస్టర్ ప్లాన్.. మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోతో కొత్త సినిమా

Rashmika Mandanna: AI దుర్వినియోగం పై మండిపడ్డ రష్మిక

Loading...
Unable to load recommendations.
Follow Us