రీజినల్‌ సినిమాలకే నేషనల్ రీచ్‌.. మారుతున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్

Updated on: Jan 28, 2026 | 1:07 PM

పాన్ ఇండియా చిత్రాల బడ్జెట్, గ్రాఫిక్స్ కన్నా ప్రాంతీయ కథాంశాలతో వస్తున్న చిత్రాలే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. పుష్ప, కాంతార వంటి చిత్రాలు జాతీయ మార్కెట్‌ను షేక్ చేశాయి. బాలీవుడ్‌లో కూడా కేవలం హిందీ చిత్రాలు తిరిగి విజయం సాధిస్తున్నాయి. రీజినల్ ఈజ్ ది న్యూ నేషనల్ అనే నినాదం ఇప్పుడు నిజమవుతోంది.

వందల కోట్ల బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, ఐదు భాషల్లో ప్రమోషన్లు వంటివి పాన్ ఇండియా సినిమాకు ప్రమాణాలుగా ఉన్న రోజులు కాలం చెల్లినట్లు ఇటీవలి బాక్స్ ఆఫీస్ లెక్కలు తెలియజేస్తున్నాయి. పాన్ ఇండియా ట్యాగ్‌తో వస్తున్న సినిమాల కంటే, ప్రాంతీయ కథాంశాలతో వస్తున్న చిత్రాలే మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. రికార్డుల పరంగానూ ప్రాంతీయ మార్కెట్‌లోనే గణనీయమైన విజయాలు నమోదవుతున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలోనూ ఇది రుజువైంది. పాన్ ఇండియా ట్యాగ్‌తో వచ్చిన ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద తడబడగా, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెలుగులో మాత్రమే విడుదలైన మన శంకర్ ఎవరు ప్రసాద్ గారు వసూళ్ల సునామి సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sonal Chauhan: సడన్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సోనాల్.. జోరు మామూలుగా లేదుగా

రజనీ – కమల్‌ మల్టీస్టారర్‌ ఏమైంది.. తెలుసుకోండి

Jr NTR: హైప్‌ పెంచుతున్న తారక్ టీమ్‌.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా

హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ