ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్
ఒక్కసారి వెండితెర మీద స్టార్ ఇమేజ్ అందుకుంటే ఆ ఫీల్డ్‌ను వదిలి పెట్టడం అన్న సాధ్యం. కారాణాలు ఏవైనా యాక్టింగ్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్న చాలా మంది స్టార్స్ తిరిగి ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో టాప్ హీరో జాయిన అవుతున్నారు. గత ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారన్న ప్రచారం గట్టిగా జరిగింది.
కానీ రీసెంట్‌గా ఓజీ రిలీజ్ తరువాత అన్ని లెక్కలు మారిపోయాయి. ఓజీకి సూపర్ హిట్ టాక్ రావటంతో యూనివర్స్ ఉంటుందని కన్ఫార్మ్ చేశారు మేకర్స్. ఆ యూనివర్స్‌లో సినిమాలు చేసేందుకు పవన్ కూడా రెడీ అన్న సిగ్నల్ ఇచ్చారు. ఆ మధ్య కేరళ ఎన్నికల్లో సంచనల విజయం సాధించిన సురేష్ గోపి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రజాసేవలోకి దిగిన తరువాత ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే మళ్లీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు. ఈ నిర్ణయంతో ఆయన హీరోగా ప్లాన్ చేసి, పక్కన పెట్టి సినిమాలను మళ్లీ లైన్‌లోకి తీసుకువస్తున్నారు మేకర్స్. మరో వైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ తరువాత సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ జననాయగన్ సినిమాను పూర్తి చేసిన విజయ్ మరే మూవీకి కమిట్ కాలేదు. మరి విజయ్ అయినా… ఈ మాట మీద నిలబడతారా.. లేదంటే అందరిలానే తరువాత సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా
పాన్ ఇండియా ట్రెండ్ లో పెరిగిన గ్రాఫిక్స్ వాడకం
NTR మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తారా..?
అనుమానాలకు చెక్ పెడుతూ.. బరిలోకి దిగనున్న వెంకీ..
Trisha: ఇవ్వని నాకు జుజుబీ.. సెటైరికల్ మాటలతో సెట్ చేసి పడేసిందిగా
