Oscar: ఎవరీ ‘కార్తికి’? RRRలా ఈమె సినిమాకీ..ఆస్కార్ లో నామినేషన్.. ఎపిక్ మొమెంట్..! వీడియో.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో నామినేట్ అయిన మరో అద్భుత సినిమా ఎదో చూద్దాం. RRR లాగే ఆస్కార్ నామినేషన్‌కి ఎంపికైన మరో సినిమా ఎలిఫెంట్ విస్పరర్స్. 42 నిమిషాల రన్‌టైమ్ ఉన్న సినిమాలో కనిపించేది ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగు పిల్లలే.. తీసింది దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్. కార్తికిది ఊటీ. దగ్గర్లోని నీలగిరి జీవావరణ రిజర్వ్‌లోనే పెరగడంతో వన్యజీవులపై ప్రేమ పెరిగింది. గిరిజన తెగలు, ప్రకృతికి గొంతుక అవ్వాలని, ప్రజల్లో మార్పు తేవాలని సంకల్పించి ఈ సినిమా తీసిందట. ఫొటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్‌లో పీజీ చేసిన కార్తికి ఆ తర్వాత మనసు మాట విని ప్రకృతి, దాని చుట్టూ జీవనంపై దృష్టిపెట్టిందట. . అయిదేళ్ల క్రితం.. ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం గమనించారామె. వాళ్లిద్దరి అనుబంధం కార్తికిని ఆశ్చర్యపరిచింది. అతనితో మాట కలిపితే తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసిన విధానం చెప్పాడు. ఆ సంఘటన కార్తికి కెరియర్‌ను మలుపు తిప్పింది. ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ తీసేలా ప్రేరేపించింది అంటుందామె.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..