Samantha: సమంత ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా ??
టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు సమంత. తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఏం మాయ చేశావే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత బృందావనం, ఈగ, దూకుడు, మనం, అత్తారింటికి దారేది, ఓ బేబీ, రంగస్థలం, యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
సమంత లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకుని ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోయారు. అయితే సామ్ చిన్నతనంలో ఓ లవ్ స్టోరీ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. సమంత పల్లావరం నుంచి టీ నగర్ లో ఉన్న స్కూల్ కు వెళ్లేందుకు రెండు బస్సులు మారాల్సి వచ్చేదట. రోజు జర్నీకే రెండు గంటలు పట్టేదట. అయితే రెండేళ్ల పాటు ఒక అబ్బాయి తన కోసం ప్రతి రోజు బస్టాండ్ లో వెయిట్ చేసేవాడట. బస్టాండ్ నుంచి స్కూల్ వరకు తన వెనుక నాలుగైదు అడుగుల వెనకాల నడిచేవాడట. ఇలా రోజూ ఫాలో అయినా తన 12TH క్లాస్ పూర్తయ్యే వరకు అతను తన మనసులో మాట చెప్పలేదట. దీంతో ఓ రోజు తానే వెళ్లి ఎందుకు ఫాలో చేస్తున్నావని అడగగా.. అబ్బే అదేంలేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఆ అబ్బాయి అంటే తనకు కూడా ఇష్టమే అయినా చెప్పలేకపోయానని అలా తన ఫస్ట్ లవ్ స్టోరీకి శుభం కార్డు పడిందట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్
New Toll Policy: వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్
మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్
Meenakshi Chaudhary: డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??