ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!

Updated on: Mar 04, 2025 | 1:14 PM

యానిమల్! 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ.. రిలీజ్‌ ఫస్ట్ డేనే అందర్నీ స్టన్ అయ్యేలా చేసింది. రణ్బీర్ యాక్టింగ్‌కు.. సందీప్ రెడ్డి వంగా టేకింగ్‌కు అందరూ సలాం కొట్టేలా చేసింది. అయితే ఓవర్ వయలెన్స్‌తో పాటు.. ఉమెన్ ను తక్కువ చేసి చూపించాడనే విమర్శ.. సందీప్ రెడ్డి పై వచ్చింది. దాంతో పాటే.. ఈ సినిమాకు రణ్బీర్ కపూరే హీరోగా ఎందుకు అనే ప్రశ్న కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది.

ఆన్సర్ కోసం సందీప్ రెడ్డి వంగా వైపే అందరూ చూసేలా చేసింది. అయితే అప్పుడు ఈ కొశ్చ్యన్ ను ఇగ్నోర్ చేసిన సందీప్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం అలా చేయకుండా ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమా చేయడానికి కారణం.. తన వన్‌ అండ్ ఓన్లీ ఛాయిస్ సందీప్ రెడ్డి వంగానే అంటూ అసలు విషయం చెప్పాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ సినిమా కోసం రణ్బీర్‌ను ఎందుకు ఎంచుకున్నాడనేది చెప్పాడు. ఈ సినిమా కథ రాయడానికి ముందు రణ్‌బీర్ కపూర్‌ను ఎంపిక చేసుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు వంగా. కథ రాయడం ప్రారంభించే ముందు, సినిమా లైన్‌ను రణ్‌బీర్ కపూర్‌తో ఆన్‌లైన్‌లో పంచుకున్నా అన్నాడు. యానిమల్ స్టోరీ లైన్ రణ్‌బీర్ కు నచ్చిన తర్వాతే సినిమా మొత్తం కథను రాశానని ఓపెన్ అయ్యాడు. అంతేకాదు రణ్బీర్ కపూర్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రతీ సన్నివేశాన్ని రాశా అన్నాడు. ఇలా ప్రేక్షకుల మెదళ్లలో ఉన్న ప్రశ్నకు.. సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చేశాడు సందీప్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 9 కోట్లే! మళ్లీ నెట్టింట అఖిల్ మ్యాటర్ వైరల్