ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం స్టార్ డైరెక్టర్ రోహిత్ షెట్టి.. బాలీవుడ్ యంగ్ హీరోలపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కొత్త హీరోల వల్ల సినీపరిశ్రమ చెడిపోతోందని.. వారే ఇండస్ట్రీని చెడగొట్టారని ఆరోపించారు. సీనియర్ హీరోలను చూడండి.. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ తమ సినిమాల గురించి మాట్లాడరు.. అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం 2 మూవీ రూ.200 కోట్లు రాబట్టింది. కానీ వారు సక్సెస్ వేడుక చేసుకోలేదు.
తన సినిమా ఇంత వసూళ్లు రాబట్టిందని తాను చెప్పుకోను..కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలు తమ ఒక్క సినిమా హిట్టైతే స్టార్ హీరోల్లా ప్రవర్తిస్తున్నారంటూ చెప్పాడు రోహిత్ షెట్టి. అంతేకాదు ఒక్క హిట్టుపడితే చాలు.. యంగ్ హీరోలు వారి రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచుతున్నారన్నాడు. ఈ పద్దతిని కాస్త తగ్గించుకుంటే బాలీవుడ్ బాగుపడుతుందంటూ చెప్పుకొచ్చాడు రోహిత్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.