తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా? లోగుట్టు ఆర్జీవీకి ఎరుక వీడియో

Updated on: Dec 07, 2025 | 1:30 PM

RGV ప్రధాన పాత్రలో షో మ్యాన్ సినిమా తెరకెక్కుతోంది. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ షర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ఆర్జీవీ ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సినిమా పై క్యూరియాసిటీని పెంచేస్తోంది. కానీ ఆర్జీవీ నుంచి మాత్రం ఇదో ఫేక్ ఫిల్మ్ అనే కామెంట్ వస్తోంది.

ఆర్జీవీ షో మ్యాన్ సినిమాతో ‘నూతన్‌’ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మతో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ 2 సినిమాలు చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఒకప్పటి స్టార్ హీరో సుమన్ ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని, అప్పుడే మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.ఇక షో మ్యాన్ సినిమాలో … ఇతర నటీనటులు, క్యాస్టింగ్ గురించి త్వరలోనే అన్ని వివరాలు తెలియ జేస్తామన్నారు మేకర్స్. గతంలో ఒక డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు హీరోగా ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక మరో వైపు ఈ సినిమాపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ఇది ఫేక్ న్యూస్ అని, ఎవరో ఏఐ సాయంతో ఇలా క్రియేట్ చేశారని ట్వీట్ పెట్టాడు. అయితే కొందరు మాత్రం రామ్ గోపాల్ వర్మ కావాలనే ఇలా చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో