Hanuman: హనుమాన్ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే ??
జాంబిరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం హనుమాన్. యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు కారణం గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్. ఇందులో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా
జాంబిరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం హనుమాన్. యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు కారణం గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్. ఇందులో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ పొగిడేశారు. అప్పుడే విడుదలైన ఆదిపురుష్ టీజర్ కంటే.. ఈ మూవీ టీజర్ సినీప్రియులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 12న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి హనుమాన్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్. “హనుమాన్ టీజర్‌పై మీరు చూపించిన ప్రేమాభిమానాలతో మాపై బాధ్యత మరింత పెరిగింది. హనుమంతుడి స్ఫూర్తికి అద్ధం పట్టేలా, మనం కలిసి ఆనందంగా పండుగల సెలబ్రేట్ చేసుకునేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తామని మీకు మాట ఇస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం”అని తమ ప్రకటనలో తెలియజేశారు మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ కొత్త మూవీ అప్డేట్ వచ్చేస్తుందోచ్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

