Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ కొత్త మూవీ అప్డేట్ వచ్చేస్తుందోచ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇక గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇక గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత చెర్రీ డైరెక్టర్ బుబ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలోనే వెలువడే అవకాశం ఉందట.