150 తెలుగు, తమిళ సినిమాలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న అలనాటి నటి
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా మరో నటి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా మరో నటి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు అలనాటి నటి పాకీజా. ఒకప్పుడు కామెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పాకీజా.. అసలు పేరు వాసుకి. అప్పట్లో పాకీజా డేట్స్ కూడా దొరికేవి కావట.. సినిమాలతో, వరుస షూటింగ్ లతో అంత బిజీగా గడిపేవారు. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమా పాకీజాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి రాణించారు. రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. తెలుగులో ఆమె 50 సినిమాల వరకు చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. సినిమాలు మానేశాక సొంత ఊరు అయిన కారైకుడికి వెళ్లిపోయిన పాకీజాకు సొంత ఇల్లు కూడా లేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకుని బాధపడ్డారు. సాయం చేయమని చాలా మంది సినిమా వాళ్లను అడిగానని.. కానీ ఎవ్వరు కనికరించడం లేదని పాకీజా ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తమిళ్ కలుపుకొని 150 సినిమాలు చేసినా కానీ చెన్నైలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయానని గోడు వెళ్లబోసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముక్కు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ప్రాణమే పోయింది
వరల్డ్ బెస్ట్ ఫిల్మ్‌గా RRR.. స్పీల్ బర్గ్‌నే వెనక్కి నెట్టిన జక్కన్న
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

