Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’.. ఈసారి నిజంగానే వస్తుందా
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ధృవ నక్షత్రం స్పై థ్రిల్లర్ ఏడేళ్లుగా విడుదలకు నోచుకోలేదు. బడ్జెట్, ఆర్థిక సమస్యల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్, తాజాగా ఫిబ్రవరి రెండో వారంలో విడుదల కాబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఈసారైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాలి.
స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వర్సటైల్ స్టార్ విక్రమ్ హీరోగా మొదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధృవ నక్షత్రం. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరుస వాయిదాలతో ఏడేళ్లుగా నిరీక్షిస్తోంది. 2015లో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమై, 2017లో షూటింగ్ మొదలైనప్పటికీ, బడ్జెట్, ఆర్థిక సమస్యలతో చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ, ఇస్తాంబుల్ వంటి దేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమా షూటింగ్ 2019 నాటికే దాదాపు పూర్తయింది. అయితే గౌతమ్ మీనన్ ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. గతంలో కూడా రిలీజ్‌కు సిద్ధమై, చివరి నిమిషంలో వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taapsee Pannu: బాలీవుడ్ మీద ఫైర్ అవుతున్న తాప్సీ..
Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్
Vijay Sethupathi: జైలర్ 2 సెట్‌లో విజయ్ సేతుపతి.. బాలయ్య గెస్ట్ రోల్ లేనట్టేనా ?
