హీరోయిన్ల విషయంలో ఎందుకు వివక్ష అంటున్న దీపికా పదుకొనే
వద్దన్నా కూడా దీపిక పదుకొనే మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఈమె పేరు మార్మోగిపోతుంది. ముఖ్యంగా కల్కి 2, స్పిరిట్ నుంచి తప్పించాక.. ఈమె ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు దీపిక. మరి 8 గంటల వర్కింగ్‌పై దీపిక మనసులో మాట ఏంటి..? హీరోలను ఆమె టార్గెట్ చేసారా..? దీపిక పదుకొనే మరోసారి మాటల తూటాలు పేల్చారు.
కల్కి 2, స్పిరిట్ లాంటి సినిమాల నుంచి తప్పించిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు దీపిక. ముఖ్యంగా ఈ సినిమాల నుంచి తనని తప్పించడంపై నో కామెంట్ అంటూనే.. చాలా కామెంట్స్ చేసారు దీపిక. పేరు చెప్పకుండా హీరోలను సైతం టార్గెట్ చేసారు. 8 గంటల కాల్షీట్ గురించి తన గళం విప్పారు దీపిక పదుకొనే. ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని.. ఇక్కడ కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారన్నారు దీపిక. మండే టూ ఫ్రైడే మాత్రమే పని చేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తారు.. అయినా కూడా హీరోలను అడిగే ధైర్యం ఎవరికీ ఉండదన్నారు ఈ బ్యూటీ. తను మాత్రమే కాదు.. ఈ మధ్య కొత్తగా అమ్మ అయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పని చేస్తున్నారని విన్నానని.. కానీ వాళ్లెవరూ హెడ్ లైన్స్ తాను తప్ప అన్నారు దీపిక. తన విషయంలోనే అదెందుకు జరిగిందో తెలియదని.. కానీ వర్కింగ్ ప్లేస్‌లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కీలకం అంటూ చెప్పుకొచ్చారు దీపిక. మార్పు కోసమే తన ప్రయత్నం అన్నారీమే. అన్నిచోట్ల 8 గంటలు పని చేస్తున్నపుడు సినిమాల్లో మాత్రం ఎందుకిలా అని ప్రశ్నిస్తున్నారు దీపిక. 8 గంటల వర్కింగ్ కండీషన్స్ మాత్రమే కాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ తేడాలు రావడంతోనే ముందు స్పిరిట్.. ఆ తర్వాత కల్కి 2 నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతున్న వేళ.. దీపిక చేసిన ఈ కామెంట్స్ మరింత వేడి రాజేయడం ఖాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ పెయిర్స్‌కు పెరుగుతున్న క్రేజ్
