Prabhas: గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

|

Apr 25, 2024 | 8:06 AM

డార్లింగ్ మంచి మనసు గురించి అందరికి తెలిసిందే. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. ఎప్పుడూ మౌనంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఇక కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుంటారు. తన సినిమా షూటింగ్ సె‏ట్లో ఉన్నవాళ్లకు ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం తెప్పిస్తాడని ఇదివరకు చాలా మంది నటీనటులు చెప్పారు. అలాగే తన తోటి ఇతర భాష నటీనటులకు తెలుగింటి రుచులను రుచి చూపిస్తాడు.

డార్లింగ్ మంచి మనసు గురించి అందరికి తెలిసిందే. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. ఎప్పుడూ మౌనంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఇక కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుంటారు. తన సినిమా షూటింగ్ సె‏ట్లో ఉన్నవాళ్లకు ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం తెప్పిస్తాడని ఇదివరకు చాలా మంది నటీనటులు చెప్పారు. అలాగే తన తోటి ఇతర భాష నటీనటులకు తెలుగింటి రుచులను రుచి చూపిస్తాడు. భోజనం విషయంలోనే కాకుండా యంగ్ హీరోలకు అండగా ఉంటాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు ప్రభాస్.

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న ప్రతి ఏడాది డైరెక్టర్స్ డేగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సినీ ప్రముఖులకు, అగ్ర హీరోలకు.. నటీనటులకు నిర్వాహకులు పంపారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు ప్రభాస్ ను కూడా ఆహ్వానించగా.. ఆయన వస్తానని మాట ఇవ్వడంతోపాటు.. డైరెక్టర్స్ అసోసియేషన్ కు 35 లక్షల విరాళాన్ని అందించారట. ఇక ఈ విషయం కాస్త బయటికి రావడంతో.. ఇండస్ట్రీలో ప్రభాస్‌ చేసిన సాయం హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే సోషల్ మీడియాలోనూ ప్రభాస్‌ది చాలా గొప్ప మనసు అనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!