Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌

Updated on: Jan 21, 2026 | 7:09 PM

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల "మన శంకర వర ప్రసాదు" సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం అత్యంత వేగంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన ఈ సినిమా, మెగాస్టార్ స్టైల్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సుస్మిత కొణిదెల ఈ రికార్డును పంచుకున్నారు.

అందరూ అనుకున్నట్టే.. మెగా స్టార్ చిరుతో.. అనిల్ రావిపూడి మ్యాజిక్ చేసేశాడు. శంకర వర ప్రసాదును జనం మెచ్చినట్టుగా చూపించాడు. ఈ సంక్రాంతికి నవ్వులు పూయించాడు. ఎస్ ! అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరు చేసిన సినిమా మన శంకర వర ప్రసాదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ఈ క్రమంలోనే ఈ మూవీ దిమ్మతరిగే కలెక్షన్స్‌తో పాటే ఓ రేర్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ.300 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన రీజనల్ సినిమాగా ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించింది. రిలీజ్ డే1 నుంచి మన శంకర వర ప్రసాదు సినిమా.. మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకుంటూ వస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా 300 క్రోర్ గ్రాస్‌ను టచ్ చేసింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ ను సాధించి.. రీజనల్ సినిమాగా సెగ్మెంట్‌లో నయా రికార్డ్‌ను సెట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని మెగా డాటర్ ప్రొడ్యూసర్ … సుస్మిత కొణిదెల ట్విటర్ వేదికగా అందరితో పంచుకున్నారు. మనశంకర వరప్రసాద్‌గారు..బాక్సాఫీస్‌ బద్దలు కొట్టారంటూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన స్వాగ్, స్టైల్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. రెండో వారంలోనూ మెగా విధ్వంసం ప్రారంభమైందంటూ సుస్మిత తన ట్వీట్‌లో కోట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం అమ్మినరోజే నగదు

భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా వేసాడు

ప్రయోజకుడై వచ్చిన కొడుకు.. కూరగాయలు అమ్ముకునే తల్లి రియాక్షన్

ఈ ఏడాది ట్రావెన్‌కోర్‌ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?

తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. ముంగిట్లో ఉన్నది చూసి మూర్ఛపోయాడు