మేకప్‌ రూమ్‌కి పిలిచి మరీ.. గోపీచంద్‌కు క్లాసు పీకిన చిరు..!

Updated on: May 01, 2025 | 3:49 PM

టాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో అందనంత ఎత్తులో ఉన్న మెగాస్టార్ చిరు.. డైరెక్టర్లకు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడుతుంటారు. వారిని ప్రోత్సహించడమో.. సరిదిద్దడమో.. అవసరమైతే క్లాసు పీకడమో చేస్తుంటారు. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా.. చిరు గురించి ఇదే చెప్పారు. చిరు వల్లే.. తాను మారానన్నారు.

కాస్త ఓపెన్‌గా ఉన్నదున్నట్టు మాట్లాడడం నేర్చుకున్నా అంటూ చెప్పారు. ఇక ఎట్ ప్రజెంట్ జాట్ సినిమాతో.. బాలీవుడ్‌ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ బిగినింగ్ డేస్‌ గురించి.. ఆ రోజుల్లో చిరు తనకిచ్చిన క్లాస్ గురించి చెప్పారు. తన మాటలతో ఇప్పుడు వైరల్ ఇక అసలు విషయం ఏంటంటే..! చిరు ‘అందరి వాడు సినిమాకు అసోసియెట్ డైరెక్టర్‌గా పని చేశారు మలినేని. అయితే ఈ క్రమంలోనే మలినేని హార్డ్‌ వర్క్‌ను.. షూటింగ్‌ సెట్లోనే పసిగట్టారట చిరు. పసిగట్టడమే కాదు.. ఓ సారి మేకప్ రూమ్‌కు పిలిచి మలినేనికి చిన్న కాస్ల కూడా పీకారట. అందరివాడు షూటింగ్‌లో ఏదైనా సీన్‌లో చిరు చేసిన యాక్టింగ్ నచ్చకపోతే.. గోపీచంద్ మలినేని.. తన ఫేస్‌ను అదోలా పెట్టేవారట. ఇక ఇది గమనించిన చిరు.. ఓ సారి మలినేనిని మేకప్‌ రూమ్‌కు పిలిచారట. గోపీచంద్ మలినేని వర్క్‌ను మెచ్చుకుంటూనే.. ఏదైనా సీన్‌లో తన యాక్టింగ్ నచ్చకపోతే తనకు వచ్చి చెప్పాలని.. ఎక్స్‌ప్రెస్‌ చేయడం నేర్చుకోవాలని సూచించారట. అంతేకానీ అక్కడే నిలుచొని మొఖం అలా పెట్టకూడదని వివరించాడట. రెండు మూడు సార్లు మలినేని ఫేస్‌ను గమనించిన చిరు… కొన్ని సీన్స్‌ను రీటేక్స్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారట. దానికి బదులుగా నచ్చకపోతే ఎదుపడి చెబితే.. తాను కరెక్ట్ చేసుకుంటా చిరు అన్నారట. దాంతో అప్పటి నుంచి మలినేనికి ఏదైనా అనిపిస్తే.. ఉన్నదన్నట్టు చెప్పడం.. కాస్త ఎక్స్‌ప్రెసివ్‌గా మారడం మొదలుపెట్టారట. ఇలా మెగాస్టార్ చిరు తెలియకుండానే డైరెక్టర్ మలినేని .. మార్చివేశారన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉగ్రదాడిపై హీరో పాజిటివ్ పోస్ట్‌.. దారుణంగా తిట్టిన ఇండియన్స్‌.. దెబ్బకు యూటర్న్‌

మా హీరోను అన్నావ్ సరే.. మరి నీకేం తెలుసు బోడి