Chiranjeevi on Acharya: మొదటిసారి ఆచార్య ప్లాప్ పై స్పందించిన చిరు.. చరణ్ కూడా వాళ్ళ కోసం వదులుకున్నాడు..

Updated on: Oct 14, 2022 | 9:28 PM

కొరటాల శివ డైరెక్షన్లో.. చిరు, చెర్రీ కాంబోలో వచ్చిన ఆచార్య.. బాక్సాఫీస్ దగ్గర ఢీలా పడడంతో.. నష్టపోయిన డిస్ట్రీబ్యూటర్స్‌ను ఆదుకున్నారు చిరు. సినిమా నుంచివచ్చే భారీ మొత్తాన్ని తాను వదులుకున్నట్టు.. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్య్వూలో చెప్పారు చిరు.


ఓ సినిమా హిట్టైతే పర్లేదు కాని.. ప్లాప్ అయితేనే.. చాలా మంది నడిరోడ్డు మీద పడాల్సి వస్తుంది. కోట్లకు కోట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. దిక్కుతోచని స్థితిలో వారిని పడేస్తుంది. కాని చాలా సందర్భాల్లో అంతదాకా రానీయకుండా మన స్టార్‌ హీరోలు హుందాగా స్పందిస్తుంటారు. చేతనైనంత సాయం చేసి.. ప్రొడ్యూసర్లకు.. డిస్ట్రీబ్యూటర్లకు భారీ నష్టాలు రాకుండా చూసుకుంటారు. ఇక తాజాగా ఆచార్య విషయంలోనూ.. మెగాస్టార్ చిరు ఇదే చేశారు.తాను మాత్రమే కాదు.. చరణ్‌ కూడా.. చాలా మొత్తం వదులుకోవాల్సి వచ్చిందన్నారు. తన సినిమా చేసి లాభాలు పొందాలే తప్ప.. ఎవ్వరూ నష్టాల పాలు కాకూడదని.. అదే తన కోరికని చెప్పారు. ఇక చిరు మాటలపై మెగా ఫ్యాన్స్ నెట్టింట గొప్పగా కామెంట్ చేస్తున్నారు. నష్టపోయిన వారికి భారీ మొత్తం ఇచ్చి కూడా.. ఎవ్వరికీ తెలియకుండా ఉంచడం అది చిరుకే చెల్లిందంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 14, 2022 09:28 PM