Heroine Roshini: చిరంజీవి ‘మాస్టర్’ సినిమా హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. వీడియో.

|

Feb 16, 2023 | 9:22 PM

తెలుగు తెరపై ఎందరో బాలీవుడ్‌ భామలు సందడి చేశారు.. అయితే కొందరు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కాగా.. మరికొందరు ఇప్పటికీ వెండితెరపై, బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

తెలుగు తెరపై ఎందరో బాలీవుడ్‌ భామలు సందడి చేశారు.. అయితే కొందరు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కాగా.. మరికొందరు ఇప్పటికీ వెండితెరపై, బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కానీ కొందరు కనుమరుగైనా.. వారి నటన మాత్రం ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసింది. ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు. వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి. ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ సినిమా అంటే ఠక్కున గుర్తొస్తుంది.1997లో ‘మాస్టర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రోషిణి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా తనదైన నటనతో మెప్పించింది. ‘మాస్టర్’ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రోషిణి కనిపిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈమె.. మరెవరో కాదు హీరోయిన్లు నగ్మా, జ్యోతికల చెల్లెలు. మొదటిగా తమిళంలోకి ‘శిష్యా’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన రోషిణి.. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన ‘మాస్టర్’లో నటించింది. ఇక కన్నడంలోకి ‘గులాబీ’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నగ్మా సోదరి అయిన రోషిణి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఆ సమయంలో ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఈ హీరోయిన్ నటించిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 16, 2023 09:22 PM