Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిన్నారికి మెగా సాయం

Updated on: Jan 11, 2026 | 4:48 PM

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ సింగర్ వరుణవికి రూ.5 లక్షల సాయం అందించి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సాయం చేసిన చిరు, కష్టాల్లో ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులకు కూడా అండగా నిలిచారు. వరుణవి భవిష్యత్తు కోసం ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నారు. ఆయన ఉదారతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతరులకు సాయం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అందరికన్నా ఓ మెట్టు ముందుటారనే కామెంట్ ఉంది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో ఆయన వెలుగు నింపిన చరిత్ర ఉంది. కష్టాల్లో ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులకు నేనున్నానంటూ అభయ హస్తం అందించిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి మంచి మనసున్న మెగాస్టార్ మరో సారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ద్వారా పరిచయమైన సింగర్ వరుణవికి తనవంతుగా సాయం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరో సారి చిరంజీవ అనిపించుకుంటున్నారు మెగాస్టార్. సరిగమప లిటిల్ ఛాంప్స్‌ షో లో అదరగొడుతున్న చిన్నారి వరుణవి.. ఇటీవల తన మనసులో మాటను బయటపెట్టింది. మెగాస్టార్‌ను కలవాలని అనిల్ డైరెక్టర్ రావిపూడితో చెప్పింది. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరు ఈ చిన్నారిని కలిశారు.తన ఒడిలో పాపను కూర్చోబెట్టుకొని తన మాటలు, పాడిన పాటలు విని మురిసిపోయారు. ఇదే సందర్భంగా పుట్టుకతో అంధురాలైన వరుణవికి తన వంతు సాయం చేస్తానని చిరు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలెబ్టుకుంటూ తన వంతు సాయాన్ని వెంటనే పంపించారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు సుస్మిత విచ్చేసింది. ఇదే సందర్భంగా ఆమె చేతుల మీదుగా వరుణవి ఫ్యామిలీకి రూ.5 లక్షల చెక్కును అందించారు చిరంజీవి. మెగాస్టార్ పంపించిన డబ్బును వరుణవి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు సుస్మిత తెలిపారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం తన కూతురు చేతుల మీదుగానే ఈ బహుమతిని చిరంజీవి పంపించారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja Saab Collection: టాక్ సంగతి పక్కకు పెడితే… రాజాసాబ్‌కు డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్‌

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్ర‌మాదం

The Raja Saab: ధురంధర్ రికార్డ్ బద్దలుకొట్టిన రాజాసాబ్

RGV: చిన్న పిల్లలు కూడా ఏదైనా చూడగలుగుతున్నారు కదా.. సెన్సార్‌ బోర్డ్‌ పై RGV బిగ్ పంచ్‌

చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు