చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్‌ కేస్‌

Updated on: Jun 13, 2025 | 5:13 PM

టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29 ప్రిజం పబ్‏లో బిల్ పే చేయకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని.. తమ సిబ్బందిని బూతులు తిట్టడంతోపాటు బాడీ షేమింగ్ చేసిందని.. ప్లేట్స్ విసిరేయడం జరిగిందంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై 324(4), 352, 351(2) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ఇదిలా ఉంటే.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించారని.. బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి.. బూతులు తిట్టారని.. తనకు క్షమాపణ చెప్పాలంటూ పబ్ బయట కల్పిక వాగ్వాదానికి దిగింది. ఇక ఇప్పుడు కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత నెల 29న కల్పిక గణేష్ బర్త్‌డే కావడంతో తన ఫ్రెండ్స్‌కీ ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు, కల్పికకి గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్‌లో కల్పికపై కేసు నమోదైంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో కల్పిక మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని వెబ్‌సిరీసుల్లోనూ నటించింది. కానీ కొన్నాళ్ల క్రితం వరుస వివాదాల్లో చిక్కుకున్న కల్పిక.. ఇప్పుడు ఈ పబ్‌ వివాదంతో వార్తల్లోకి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

సాయంత్రం చిరుతిండికి బ‌దులు వీటిని తింటే.. ఎన్నో లాభాలు

చెత్త మధ్యన ఉన్నది ఏదో సాధారణ శిల్పం అనుకుంటే పొరపాటే